ప్రకాశం జిల్లాలో దారుణం .. యువకుడి దారుణ హత్య
- వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానం
- మంగమూరు చెరువు కట్ట వద్ద కత్తులతో పొడిచి చంపిన దుండగులు
- కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్యతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి అశోక్ (30) అనే యువకుడిని కొందరు వ్యక్తులు గ్రామ చెరువు కట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. స్థానికుల సమాచారంతో ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు, సంతనూతలపాడు ఎస్ఐ వేజెండ్ల అజయ్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
వివాహేతర సంబంధం కారణంగా ఏర్పడిన వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.